News July 7, 2025
కొండమడుగు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

బీబీనగర్ మండలం కొండమడుగులో అక్రమాలపై కలెక్టర్ హనుమంత రావు సీరియస్ అయ్యారు. గ్రామపంచాయతీలో పలు అక్రమాలకు పాల్పడిన పంచాయతీ సెక్రటరీ అలివేలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మండల పంచాయతీ అధికారి, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మాజీద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు.
Similar News
News July 8, 2025
దువ్వాడ మీదగా రెండు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు దువ్వాడ మీదగా రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. సంత్రగచి – యశ్వంతపూర్ (02863/64) జూలై 10నుంచి ఆగష్టు 28వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు పేర్కొన్నారు. షాలిమార్ – చెన్నై సెంట్రల్ (02841/42) జూలై 14 నుంచి జూలై 28వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News July 8, 2025
మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు

ఉరవకొండ మం. బూధగవి సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు మహారాష్ట్ర శివ్‌గావ్ ప్రాంతానికి చెందిన తుషార్, శ్రీకర్, కార్తీక్‌గా గుర్తించారు. సుమిత్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. వారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా కారు బోల్తా పడటంతో ఈ విషాద ఘటన జరిగింది. ఉరవకొండ CI మహానంది, SI జనార్దన్ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News July 8, 2025
తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.