News July 7, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సర్దార్ కాటన్ బ్యారేజీలో ఈ నెల 12వ తేదీ నాటికి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు చేరే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News July 8, 2025

సత్తెనపల్లి: ఫారెక్స్ మోసం, వరకట్న వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు

image

సత్తెనపల్లిలో రెండు వేర్వేరు ఫిర్యాదులు ఎస్పీకి చేరాయి. ఫారెక్స్ వ్యాపారంలో 10% లాభం ఆశచూపి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, మధుసూదన్ రెడ్డిలు తనను రూ.45.67 లక్షలు మోసం చేశారని భీమవరం వాసి బలుసుపాటి కోటయ్య ఫిర్యాదు చేశారు. మరోవైపు సంతానం లేదని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని నాగన్నకుంటకు చెందిన షేక్. తాహిరా న్యాయం చేయాలని కోరారు.

News July 8, 2025

రేపల్లెలో యువకుడి ఆత్మహత్య

image

రేపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి(25)గా గుర్తించారు. చర్లపల్లి నుంచి రేపల్లె వస్తున్న ట్రైన్(17645) కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమచారం. రేపల్లె రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్, జీఆర్పీఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News July 8, 2025

అనకాపల్లి: స్కూల్ బస్సు, బైక్ ఢీ

image

చోడవరం-గవరవరం రోడ్డులో అన్నవరం, రేవళ్లు మధ్య మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చోడవరానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతనని వెంటనే చోడవరం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.