News July 8, 2025
సిరిసిల్ల: ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 151 దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించి, వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
జనగామ: భర్తను కడతేర్చిన ఇద్దరు భార్యలు.!

ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉండాల్సిన భర్త వారి చేతిలోనే బలైన ఘటన లింగాలగణపురం(M) ఎనబావిలోని పిట్టలోనిగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలియా కనకయ్య(30)కు.. సొంత అక్కాచెళ్లెల్లు శిరీష, గౌరమ్మ అనే భార్యలు ఉన్నారు. ఇటీవల కనకయ్య అత్తను హత్య చేసి జైలుకు వెళ్లి రావడంతో భార్యలు కాపురానికి వెళ్లకుండా తల్లిగారింటిలోనే ఉంటున్నారు. మద్యం మత్తులో భార్యల వద్దకు గొడ్డలితో వచ్చిన కనకయ్యను వారు హతమార్చారు.
News July 8, 2025
జనగణన.. పౌరులే వివరాలు సమర్పించే అవకాశం

దేశ వ్యాప్తంగా చేపట్టే జన, కులగణనలో పౌరులే నేరుగా తమ వివరాలు సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కల్పించనుంది. ఇందుకోసం త్వరలోనే ఓ వెబ్‌సైటును అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 2026 ఏప్రిల్ 1న ఇళ్ల వివరాలతో కూడిన జాబితా, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి జనగణనను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. ఇదే సమయంలో కులగణననూ చేపడతారు. ఈ రెండు విడతల్లోనూ ప్రజలు తమ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయవచ్చు.
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.