News July 8, 2025

బుధవారం వరంగల్ మార్కెట్ బంద్.. ఎందుకంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం బంద్ ఉండనున్నట్లు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధవారం జరిగే సమ్మెలో మార్కెట్ కార్మికులు పాల్గొంటారని చెప్పారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News July 8, 2025

పెద్దపల్లి: ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.5 కోట్ల వరకు రుణాలు

image

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జాతీయ SC కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ అన్నారు. రంగంపల్లిలోని సదస్సులో ఆయన మాట్లాడారు. క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌, ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా రూ.లక్ష- రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు
ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

image

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News July 8, 2025

ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

image

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.