News July 8, 2025
వైద్యులకు మహబూబాబాద్ DMHO హెచ్చరిక

అర్హతకు మించి వైద్యం చేయరాదని DMHO హెచ్చరించారు. మరిపెడలోని రవి బాబు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి రోగులకు వైద్యాధికారి అందిస్తున్న చికిత్స విధానాన్ని పరిశీలించగారు. ఈ క్రమంలో ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్ ఇంజిక్షన్లు, యాంటీ బయాటిక్‌లు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స చేస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూరవి బాబు క్లినిక్‌ను సీజ్ చేశారు.
Similar News
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News July 8, 2025
ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.
News July 8, 2025
PDPL: సైకాలజీలో గోల్డ్ మెడల్.. జిల్లాలోనే మొదటి మహిళ

ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన గుండేటి వెంకటేష్ సతీమణి కవిత కాకతీయ యూనివర్సిటీ పీజీ మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా బంగారు పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని పొందారు. జిల్లాలో సైకాలజీ విభాగంలో బంగారు పతకం పొందిన మొదటి మహిళ కావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆమెను అభినందించారు.