News July 8, 2025
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..51% పనులు పూర్తి.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 51 శాతం పనులు పూర్తయినట్లు SCR GM సందీప్ మాథూర్ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు.!

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
News July 8, 2025
బడిబాటలో హైదరాబాద్ టాప్

బడిబాటలో హైదరాబాద్ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడడంతో ఆదరణ పెరుగుతోంది. అధికారుల విస్తృత ప్రచారంతో కొత్త అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ ఏడాది గవర్నమెంట్ స్కూల్లో 1st క్లాస్‌లో HYD-6359, మేడ్చల్- 2962, రంగారెడ్డి-2127 అడ్మిషన్లు వచ్చాయి. ఇక 2వ తరగతి నుంచి పదో తరగతి వరకు HYD-9,674, మేడ్చల్-5262, రంగారెడ్డి-3642 మంది విద్యార్థులు సర్కారు బడిలో చేరారు.