News July 8, 2025

PDPL: ‘ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఈ నెల 15లోపు SC, ST విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో కూడిన ఆధారాలు, పేపర్‌ క్లిప్పింగ్‌లు, ఫొటోలు, స్వచ్ఛంద సేవ సంస్థలకు చేసిన సేవలతో కూడిన ఆధారాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులకు ఎలాంటి పారితోషకాలు ఉండవని స్పష్టం చేశారు.

Similar News

News July 8, 2025

ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

image

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.

News July 8, 2025

తల్లులకు పాదాభివందనం చేయించాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తల్లులకు విద్యార్థుల చేత పాదాభివందనం చేయించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహణపై ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12.30 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు.

News July 8, 2025

హై బడ్జెట్.. MEGA157 నాన్ థియేట్రికల్ రైట్స్‌కే రూ.100 కోట్లు?

image

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌ నుంచే రూ.100 కోట్ల వరకూ వసూలు చేయాలని, అలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నాయి. కాగా, MEGA157 చిత్రీకరణకు రూ.180 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.