News July 8, 2025
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ జవాబు పత్రాల నకలుకు దరఖాస్తుల ఆహ్వానం

ఓయూ పరిధిలోని ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 8, 2025
10న నెల్లూరు జిల్లాలో కీలక సమావేశం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3,600 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 143 కళాశాలల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఈవో బాలాజీ రావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెంకటప్పయ్య పాల్గొన్నారు.
News July 8, 2025
పెద్దపల్లి: ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.5 కోట్ల వరకు రుణాలు

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జాతీయ SC కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. రంగంపల్లిలోని సదస్సులో ఆయన మాట్లాడారు. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్, ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా రూ.లక్ష- రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు
ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.