News July 8, 2025

ఈ-ఆరోగ్యం నమోదులో కామారెడ్డి జిల్లాకు అగ్రస్థానం

image

కామారెడ్డి జిల్లా ఈ-ఆరోగ్యం ఆన్‌లైన్ అప్లికేషన్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25,152 మంది చికిత్స పొందగా, 23,723 మంది డాక్టర్లను సంప్రదించారు. 5,232 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 21,539 మంది ఔషధ సేవలు పొందారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, DMHO చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Similar News

News July 8, 2025

10న నెల్లూరు జిల్లాలో కీలక సమావేశం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3,600 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 143 కళాశాలల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఈవో బాలాజీ రావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెంకటప్పయ్య పాల్గొన్నారు.

News July 8, 2025

పెద్దపల్లి: ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.5 కోట్ల వరకు రుణాలు

image

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జాతీయ SC కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ అన్నారు. రంగంపల్లిలోని సదస్సులో ఆయన మాట్లాడారు. క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌, ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా రూ.లక్ష- రూ.5 కోట్ల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు
ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 8, 2025

బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

image

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.