News July 8, 2025

వనపర్తి: ఆర్టీసీ ఛార్జీలు మోత.. ప్రయాణికులపై భారం

image

RTCచార్జీలు పెంచడంతో ప్రయాణికులపై భారం పడింది. టోల్ ఛార్జీలు పెరగడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 10RTC డిపోలు ఉండగా అధిక బస్సులు హైద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 2టోల్ గేట్లు ఉండగా బస్సు టికెట్ పై రూ.10నుంచి రూ.20వరకు పెంచారు. వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా హైదరాబాద్‌కు 2టోల్ గేట్లు కాగా బిజినేపల్లి మీదుగా 1టోల్‌గేట్ ఉంది.

Similar News

News July 8, 2025

రాజమండ్రిలో ఈనెల 13న బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక

image

బాస్కెట్ బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక ఈనెల 13న రాజమండ్రి ఎస్ కే వీటీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు పిఠాపురంలో మీడియాతో తెలిపారు. అదే రోజు జిల్లా చాంపియన్ షిప్ నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఒరిజినల్ ఆధార్, పుట్టిన రోజు సర్టిఫికెట్ తో హాజరు కావాలని సూచించారు.

News July 8, 2025

గద్వాల: ‘ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలి’

image

పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్‌‌లో పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత ముఖ్యమైందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరే విధంగా చూడలన్నారు.

News July 8, 2025

శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

image

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.