News July 8, 2025
రేపు పార్వతీపురంలో జాబ్ మేళా

పార్వతీపురంలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఊపాధి కల్పన అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా పార్వతీపురం జూనియర్ కళాశాలలో జరుగుతుందని, వివిధ ఫార్మా సంస్థలు 85 ఖాళీలను భర్తీ చేస్తాయని ఆమె చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News July 8, 2025
జీవో 49ని రద్దు చేయాలి: ADB Ex MP

ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉందని మాజీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే రద్దుచేసి గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. HYDలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
News July 8, 2025
అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి గోదావరి నది తీర ప్రాంతం వెంబడి 6 అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లను పిలవడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పర్యాటకరంగ, అడ్వెంచర్ టూరిజం ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టెండర్ ప్రతిపాదనలపై ఆయన వారితో సమీక్షించి సూచనలు చేశారు.
News July 8, 2025
రాజమండ్రిలో వద్ద ‘దిశ’ సమావేశం

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ‘దిశ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.