News July 8, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కుసుమ కుమార్

స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కుసుమ కుమార్‌ను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈయన గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీ నుంచి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
Similar News
News July 8, 2025
ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.
News July 8, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.