News July 8, 2025

‘అల్లూరి జిల్లాలో 2500 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం’

image

వనం – మనం కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో 2500 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని డ్వామా PD. విద్యా సాగర్ సోమవారం తెలిపారు. పాడేరు, చింతపల్లి డివిజన్‌లలో సిల్వర్ ఓక్ మొక్కలను, రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో పండ్లు జాతి మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 22 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు.

Similar News

News July 8, 2025

రాజమండ్రిలో వద్ద ‘దిశ’ సమావేశం

image

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ‘దిశ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.

News July 8, 2025

ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

image

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.

News July 8, 2025

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

image

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.