News July 8, 2025
ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి RTC బస్సులు

ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల దైవ దర్శనాల కోసం ప్రత్యేకంగా RTC డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RTC RM సరిరామ్ తెలిపారు. జులై 13న ఉదయం 5 గంటలకు ఇల్లందు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.440 నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 91364 46666, 98661 59829 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News July 8, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.
News July 8, 2025
జగిత్యాల: కుటుంబ సభ్యులే కాలయముళ్లు!

జగిత్యాల జిల్లా కోరుట్లలో గతంలో జరిగిన దీప్తి హత్య కేసులో, మొన్న జరిగిన చిన్నారి హితీక్ష హత్య కేసులో రక్త సంభందికులే హంతకులుగా తేలారు. ఈ రెండు హత్యకేసులు అప్పుడు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీప్తి హత్య కేసులో సొంత చెల్లెలు చందన, ఆమె ప్రియుడు ఉమర్ నేరస్థులు కాగా, హితీక్ష హత్య కేసులో పిన్నీ(బాబాయి భార్య) మమత హంతకురాలు అయ్యింది.