News July 8, 2025

‘డిగ్రీ’ వద్దంటా..!

image

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

Similar News

News July 8, 2025

ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే?

image

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. మీరు ఎంత సేపు నిద్రపోతున్నారు? COMMENT

News July 8, 2025

భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

image

TG: ఇద్దరు భార్యల చేతిలో ఓ భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. లింగాలఘణపురం(M) పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్య(30)కు భార్యలు శిరీష, గౌరమ్మ(అక్కాచెల్లెళ్లు) ఉన్నారు. ఇటీవల వారి తల్లిని కనకయ్య చంపేశాడు. అప్పటి నుంచి భార్యలు పుట్టింట్లోనే ఉన్నారు. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలంటూ వారిని బెదిరించడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు భార్యలు కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు.

News July 8, 2025

ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు: లోకేశ్

image

AP: MLA ప్రశాంతిరెడ్డిపై YCP నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైరయ్యారు. వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణమన్నారు. ‘YCP నేతలకు మ‌హిళలంటే ఇంత ద్వేష‌భావ‌మా? త‌ల్లి, చెల్లిని త‌రిమేసిన జ‌గ‌న్‌ గారిని ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టున్నారు. మ‌హిళ‌ల జోలికి వస్తే ఊరుకునేందుకు ఇది జ‌గ‌న్ గారి జంగిల్ రాజ్ కాదు.. మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచే ప్ర‌జాప్ర‌భుత్వం’ అని వ్యాఖ్యానించారు.