News July 8, 2025
పరిగి తహశీల్దార్ ఆనందరావుపై వేటు?

ప్రభుత్వ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి తహశీల్దార్ ఆనందరావుపై శాఖపరమైన చర్యలు తీసుకొని కలెక్టరేట్‌కు అటాచ్ చేసినట్లు సమాచారం. గత 12 రోజులగా ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, కలెక్టర్‌కు ఫిర్యాదు ఫలితంగా వేటు పడిందని, దీంతో కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరి నూతన తహశీల్దార్‌గా పరిగి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనందరావు సెలవులో ఉన్నారు.
Similar News
News July 8, 2025
ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.
News July 8, 2025
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.