News July 8, 2025
పాశమైలారంలో వారం రోజులుగా పడిగాపులు

సిగాచీలో పేలుడు ఘటన ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. పరిశ్రమంలో పనిచేసేందుకు వచ్చిన వారు ఇలా అకస్మికంగా దూరం కావడంతో ఆ కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. వారం రోజులుగా గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. చివరి చూపు కూడా నోచుకోకుండా పోతున్నామని మనోవేదనకు లోనవుతున్నారు. ఘటన సమయంలో వెలువడిన భారీ వేడికి బాడీలు పూర్తిగా కాలిపోయి బూడిదగా కలిసిపోయి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
Similar News
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2025
జీవో 49ని రద్దు చేయాలి: ADB Ex MP

ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉందని మాజీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే రద్దుచేసి గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. HYDలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
News July 8, 2025
అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి గోదావరి నది తీర ప్రాంతం వెంబడి 6 అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లను పిలవడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పర్యాటకరంగ, అడ్వెంచర్ టూరిజం ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టెండర్ ప్రతిపాదనలపై ఆయన వారితో సమీక్షించి సూచనలు చేశారు.