News July 8, 2025

GHMC పరిధిలోకి మేడ్చల్?

image

గ్రేటర్ మరో కొత్త రూపంగా అవతరించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. GHMCలో ఇప్పటికే 24 నియోజకవర్గాలు, 150 డివిజన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా మేడ్చల్ మారడంతో ఇక్కడి మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో GHMCని 3 భాగాలుగా విభజిస్తామని ప్రకటించినా నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలను విలీనం చేస్తే HYD శివారు మరింత అభివృద్ధి కానుంది.

Similar News

News July 8, 2025

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి

image

పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి కౌలు రైతు మృతి చెందిన ఘటన కొల్లూరులో మంగళవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు కొల్లూరుకు చెందిన రైతు పత్తిపాటి శ్రీనివాసరావు(53) వరి పంటకు నీళ్లు పెట్టడానికి విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

News July 8, 2025

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సీత్లా పండుగ

image

బంజారాలు ఈ ఏడాదిలో జరుపుకునే మొదటి పండుగ సీత్లా. ముఖ్యంగా బంజారా తెగలో ప్రకృతిని, పశుసంపదను, పంటలను కాపాడే దేవతైన సీత్లా మాతను పూజిస్తారు. పండుగను ఏటా ఆషాఢమాసంలో జరుపుకుంటారు. భవానీ మాతకు మహిళలు నైవేద్యంగా పాయసం, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, గుగ్గిళ్లను సమర్పిస్తారు. మీ తండాల్లో ఈరోజు సీత్లా పండుగ జరుపుకుంటున్నారా?.. COMMENT చేయండి.

News July 8, 2025

రాజమండ్రిలో ఈనెల 13న బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక

image

బాస్కెట్ బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక ఈనెల 13న రాజమండ్రి ఎస్ కే వీటీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు పిఠాపురంలో మీడియాతో తెలిపారు. అదే రోజు జిల్లా చాంపియన్ షిప్ నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఒరిజినల్ ఆధార్, పుట్టిన రోజు సర్టిఫికెట్ తో హాజరు కావాలని సూచించారు.