News July 8, 2025
మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తింపు

ఉరవకొండ మం. బూధగవి సమీపంలో అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు మహారాష్ట్ర శివ్‌గావ్ ప్రాంతానికి చెందిన తుషార్, శ్రీకర్, కార్తీక్‌గా గుర్తించారు. సుమిత్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. వారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా కారు బోల్తా పడటంతో ఈ విషాద ఘటన జరిగింది. ఉరవకొండ CI మహానంది, SI జనార్దన్ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News July 8, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2025
జీవో 49ని రద్దు చేయాలి: ADB Ex MP

ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉందని మాజీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే రద్దుచేసి గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. HYDలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.