News July 8, 2025
మహిళా సంఘాల బీమా పొడిగింపు

TG: మహిళా సంఘాలకు ప్రమాద బీమాను మరో నాలుగేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు 2029 వరకు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షలు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 419 మంది ప్రమాద బీమా కోసం అప్లై చేయగా 204 కేసులు సెటిల్ చేశారు. కాగా స్వయం సహాయక సంఘాల్లో 47 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు.
Similar News
News July 8, 2025
‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News July 8, 2025
జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
News July 8, 2025
ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే?

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. మీరు ఎంత సేపు నిద్రపోతున్నారు? COMMENT