News July 8, 2025
Historic Moment

శ్రీశైలం డ్యాం చరిత్రలో జులైలో గేట్లు తెరుస్తుండటం ఇది ఐదోసారి. సాధారణంగా ఆగస్టు, SEPలో గేట్లు ఎత్తుతుంటారు. ఈసారి జూన్‌లోనే ఎగువన వర్షాలు కురవడంతో డ్యాంకు వరద భారీగా చేరుతోంది. కొన్నిగంటల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉండటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
★ జులైలో గేట్లు ఎత్తిన సందర్భాలు..
2025: జులై 8, 2007: జులై 23, 2021: జులై 28, 2022: జులై 23, 2024: జులై 29
Similar News
News July 8, 2025
ఎల్కతుర్తి: స్టార్టర్ బాక్స్‌లో నాగుపాము

మోటార్ స్టార్టర్ బాక్స్‌లో నాగుపాము దర్శనమిచ్చిన ఘటన ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ శివారులో ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు అడ్డూరి బాబు ఉదయం పొలం వద్దకు వెళ్లి నారు మడికి నీరు పెట్టడానికి స్టార్టర్ బాక్స్ తాళం తీసి చూసేసరికి అందులో నాగు పాము కనిపించింది. సుమారు గంట సేపు తర్వాత ఆ పాము వెళ్లిపోయింది. రైతులూ జర జాగ్రత్త.
News July 8, 2025
ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే?

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. మీరు ఎంత సేపు నిద్రపోతున్నారు? COMMENT
News July 8, 2025
భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

TG: ఇద్దరు భార్యల చేతిలో ఓ భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. లింగాలఘణపురం(M) పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్య(30)కు భార్యలు శిరీష, గౌరమ్మ(అక్కాచెల్లెళ్లు) ఉన్నారు. ఇటీవల వారి తల్లిని కనకయ్య చంపేశాడు. అప్పటి నుంచి భార్యలు పుట్టింట్లోనే ఉన్నారు. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలంటూ వారిని బెదిరించడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు భార్యలు కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు.