News July 8, 2025
HYD: బతుకమ్మ కుంట బతికింది!

అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటకు ప్రాణం పోసింది హైడ్రా. కబ్జా చెర నుంచి విడిపించి, అదే స్థాయిలో సుందరీకరిస్తోంది. తాజాగా బతుకమ్మ కుంట ఫొటోలను విడుదల చేసింది. ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి ఉన్న 5 ఎకరాల 15 గుంటలు ఇప్పుడు నిండు కుండలా మారింది. సెప్టెంబర్‌లోపు సుందరీకరణ పనులు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దసారకు ‘బతుకమ్మ’ కుంట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది అనడంలో సందేహం లేదు. దీనిపై మీ కామెంట్?
Similar News
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోం: మంత్రి సురేఖ

TG: భద్రాచలం ఈవో రమాదేవిపై <<16992146>>దాడిని<<>> దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఏపీ పరిధిలోనిది కావడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకొని, సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆమె కోరారు. తెలంగాణలో ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సురేఖ హెచ్చరించారు.
News July 8, 2025
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో బీసీ బాలురు, బాలికల వసతి గృహ నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల ఆలస్యానికి గల కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8గదులను త్వరగా నిర్మిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ స్వయంగా గదులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, వేగంపై పలు సూచనలు చేశారు.