News July 8, 2025

హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్‌ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT

Similar News

News July 8, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

News July 8, 2025

పలు అంశాలపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవసరాలకు సరిపడినంత ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వివిధ నిర్మాణాలకు సేకరణ, అక్రమ రవాణా నియంత్రణ, భూ భారతి చట్టం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమగు ఇసుక అంచనా నివేదికను సిద్ధం చేయాలన్నారు.

News July 8, 2025

మహదేవపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్

image

మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఐ జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో గోడలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వాల్ కొటేషన్స్ ద్వారా మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటూ, సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్ఐ అన్నారు.