News July 8, 2025
జనగామ: భర్తను కడతేర్చిన ఇద్దరు భార్యలు.!

ఇద్దరు భార్యలతో సంతోషంగా ఉండాల్సిన భర్త వారి చేతిలోనే బలైన ఘటన లింగాలగణపురం(M) ఎనబావిలోని పిట్టలోనిగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కాలియా కనకయ్య(30)కు.. సొంత అక్కాచెళ్లెల్లు శిరీష, గౌరమ్మ అనే భార్యలు ఉన్నారు. ఇటీవల కనకయ్య అత్తను హత్య చేసి జైలుకు వెళ్లి రావడంతో భార్యలు కాపురానికి వెళ్లకుండా తల్లిగారింటిలోనే ఉంటున్నారు. మద్యం మత్తులో భార్యల వద్దకు గొడ్డలితో వచ్చిన కనకయ్యను వారు హతమార్చారు.
Similar News
News July 8, 2025
EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ASFలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను నెలవారి తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News July 8, 2025
‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News July 8, 2025
వనపర్తి: గర్భిణుల రక్తహీనతపై ప్రత్యేక చొరవ: DM&HO

గర్భిణుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లను డీఎంఅండ్‌హెచ్ఓ శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యం మహిళ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని డీఎంఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, పట్టణంలో రోజు జ్వర సర్వే చేయించాలని ఆదేశించారు. మంజూల, ఫయాజ్, హెల్త్ సూపర్వైజర్ సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.