News July 8, 2025
అనకాపల్లి: స్కూల్ బస్సు, బైక్ ఢీ

చోడవరం-గవరవరం రోడ్డులో అన్నవరం, రేవళ్లు మధ్య మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చోడవరానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతనని వెంటనే చోడవరం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.
Similar News
News July 8, 2025
ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్‌తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్‌లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.
News July 8, 2025
15ఏళ్లు ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి!

అందరిలా 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకునేవారికి ప్రముఖ సీఏ కానన్ బహ్ల్ లింక్డ్ఇన్‌లో పలు సూచనలు చేశారు. పెరుగుతున్న ఖర్చులు, జీవనశైలి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లకే రిటైర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ‘ఫ్యూచర్ గురించి ఆలోచించి పొదుపును పెంచాలి. EPF & NPSలలో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీ డబ్బును ఎక్కువ కాలం బ్లాక్ చేసి దుర్వినియోగం చేయకుండా చూస్తాయి’ అని తెలిపారు.
News July 8, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.