News July 8, 2025
మెదక్: 86 శాతం మందికి పంపిణీ

మెదక్ జిల్లాలో మూడు నెలల కోటాకు సంబంధించి బియ్యం పంపిణీ 86 శాతం మంది రేషన్ దారులు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,16,716 కార్డుదారులు ఉండగా, 1,86,578 మంది బియ్యం తీసుకున్నారని డీఎస్వో నిత్యానందం తెలిపారు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. మళ్లీ సెప్టెంబర్లో పంపిణీ చేయనున్నారు.
Similar News
News August 31, 2025
తూప్రాన్: రూ.4.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన

తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతుపల్లి శివారులో హల్దీ వాగుపై నూతనంగా రూ.4.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హల్దీ వాగుపై నిర్మించిన కాజ్ వే వరదలకు కొట్టుకుపోవడంతో ఆదివారం ఆయన పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కాజ్ వే దెబ్బ తినడంతో రాకపోకలకు అవకాశం లేదన్నారు.
News August 31, 2025
మహిళల, బాలికల భద్రత కోసమే షీ టీమ్స్: ఎస్పీ

ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్లో ఈవ్టీజర్స్పై 2 ఎఫ్ఐఆర్లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
News August 31, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజావాణి

కలెక్టరేట్లో రేపు సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సోమవారం ప్రజావాణి హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు.