News July 8, 2025
NLG: స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఉమ్మడి జిల్లాకు AICC కార్యదర్శి సంపత్ కుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని అధిష్ఠానం ఆదేశించింది.
Similar News
News July 8, 2025
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో బీసీ బాలురు, బాలికల వసతి గృహ నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.వసతి గృహ నిర్మాణ పనుల పురోగతిని పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల ఆలస్యానికి గల కారణాలు ఏమిటని కలెక్టర్ ప్రశ్నించగా మొత్తం 8గదులను త్వరగా నిర్మిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ స్వయంగా గదులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, వేగంపై పలు సూచనలు చేశారు.
News July 8, 2025
మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కిలో టమాటా రూ.37 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ అభిలాశ్ తెలిపారు. వారం రోజులుగా రూ. 34 నుంచి 37 వరకు పలికాయన్నారు. ఏకంగా 10 కిలోల మేలు రకం టమాటా బాక్స్ రూ.370, రెండో రకం రూ.350, మూడో రకం రూ.310 పలికినట్లు వెల్లడించారు. మొత్తం 1,055 క్వింటాళ్ల టమాటా మార్కెట్‌కు వచ్చిందన్నారు. రేట్లు ఇలాగనే ఉంటే రైతుల కలలు నెరవేరుతాయని చెప్పారు.
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.