News July 8, 2025
జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ASFలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను నెలవారి తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News July 8, 2025
‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ అరెస్ట్

‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి తండ్రి బాబు షాహిర్, నిర్మాత షాన్ ఆంటోనీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే వారు స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఆర్థిక మోసం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఆ మూవీ కోసం తన నుంచి సౌబిన్, ఆంటోనీలు రూ.7 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఇన్వెస్టర్ సిరాజ్ వలియతుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.