News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.
Similar News
News July 8, 2025
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే: మంత్రి

మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. గత BRS ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
News July 8, 2025
‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్‌బాబు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.
News July 8, 2025
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ

విశాఖ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ మెమో ఉత్తరులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం మెమో పత్రాలను లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్, ఏపీయూడబ్ల్యూజే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ సంఘాల నాయకులకు డీఈవో ప్రేమ్ కుమార్ అందజేశారు. దీనిపై పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.