News July 8, 2025
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.
Similar News
News July 8, 2025
JNTU: వారిని తక్షణం సస్పెండ్ చేయండి: విద్యార్థులు

JNTU సుల్తాన్‌పూర్ కళాశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేసి విద్యార్థులకు విద్యను అభ్యసించే వాతావరణాన్ని నెలకొల్పాలి కోరుతూ వర్సిటీ రిజిస్ట్రార్‌కు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులు వారి సమస్యలు చెప్పుకోలేక మెయిల్స్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి నేతలు కోరారు.
News July 8, 2025
ఎన్టీఆర్‌తో నటించడం గౌరవంగా ఉంది: హృతిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం తనకు గౌరవంగా ఉందని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అన్నారు. ‘వార్ 2’ షూట్ ప్యాకప్ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘149 రోజుల జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కియారా అద్వానీతో నటించడం మరిచిపోలేను. ఈ సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. ఆగస్టు 14న మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా నిన్న హృతిక్‌పై <<16982214>>తారక్ ప్రశంసలు<<>> కురిపించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలే: RSS

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానంలో హిందీని తప్పనిసరి చేయాలన్న <<16168195>>వివాదం<<>> నేపథ్యంలో RSS కీలక ప్రకటన చేసింది. దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని స్పష్టం చేసింది. ఒకే భాషను RSS సమర్థించదని పేర్కొంది. కాగా ఈ విధానం ద్వారా కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని ఇటీవల తమిళనాడు, మహారాష్ట్రలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈక్రమంలోనే RSS నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.