News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.
Similar News
News February 11, 2026
చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక

టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS)లో టీచర్లు నమోదు చేసిన తప్పుల సవరణకు విద్యాశాఖ అనుమతించిందని చిత్తూరు డీఈవో రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టీచర్లు వారి వ్యక్తిగత వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులుంటే తగిన ఆధారాలతో ఈనెల 14వ తేదీలోపు డీఈవో, ఆర్జేడీ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఐఎస్ డేటాలో హెచ్ఎంలు, టీచర్లు తప్పుడు సమాచారం పొందుపరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 11, 2026
చిత్తూరు: కోట్ల రూపాయలు విలువ చేసే భూమిపై కన్ను…!

అనంతపురం- చెన్నై హైవేలోని రొంపిచెర్ల(M) బండకిందలో రూ.3 కోట్లు విలువ చేసే సర్వే నంబర్ 32, 36 లో సుమారు 0.75 సెంట్ల భూమిని ఆక్రమించి చదును చేసుకున్నారు. 2,3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కబ్జాదారుడు ఒకడుగు ముందుకు వేసి కంచె వేసి మామిడి మొక్కలు నాటేశారు. 20 రోజుల క్రితం బడబళ్లవంక నుంచి ఎర్రబాపన చెరువుకు పోతున్న సప్లై ఛానల్‌ను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News February 11, 2026
వెల్ఫేర్ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి: చిత్తూరు కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులతో సమీక్ష నిర్వహించారు. బృంద సభ్యులు ప్రతిరోజు హాస్టల్స్ తనిఖీ చేసి నివేదికలను తనకు అందజేయాలని సూచించారు. హాస్టల్స్‌లో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు వస్తే వార్డెన్‌పై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు సోకకుండా చూడాలన్నారు.


