News July 8, 2025

MHBD: RMP వైద్యం వికటించి బాలుడు మృతి!

image

కేసముద్రం మండలం బావుజీ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. RMP చేసిన వైద్యం వికటించి తమ కుమారుడు చరణ్ (15) మృతి చెందాడని ధరావత్ బాలోజీ, అనితా దంపతులు ఆరోపించారు. కడుపునొప్పితో RMP దగ్గరకు వెళ్తే రెండు ఇంజక్షన్లు, మూడు టాబ్లెట్స్ ఇచ్చారని తెలిపారు. కాసేపటికి బాలుడు మృతిచెందినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.

Similar News

News July 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 9, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 9, 2025

జనగామ: నిరుద్యోగ యువతకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌లోని TGMBCDC ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు 4 రోజుల పాటు ఉచిత శిక్షణ కల్పించనున్నారు. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, రెస్యూమ్ బిల్డింగ్ వంటి అంశాల్లో శిక్షణతోపాటు టీఏ, భోజనం, వసతి సదుపాయాలు ఉంటాయని జనగామ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.రవీందర్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల అభ్యర్థులు జులై 14లోగా దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.