News July 8, 2025
HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో 2.5 టన్నుల ఈ-వేస్ట్ తొలగింపు..!

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా HYD జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం నుంచి 2.5టన్నుల ఈ-వేస్ట్‌ను అధికారులు తొలగించారు. ఇందులో పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్ట్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ఈ-వేస్ట్‌ను ఆసియాలోనే మొదటి LEED ప్లాటినమ్-సర్టిఫైడ్ ఫెసిలిటీ అయిన దుండిగల్ వద్దకు తరలించారు. ఇక్కడే రీసైకిలింగ్ జరుగుతుందని తెలిపారు.
Similar News
News July 8, 2025
HYD: చెరువులను సందర్శించిన కర్ణాటక ఇంజినీర్లు

నగరంలో హైడ్రా పనితీరును బెంగళూరు లేక్స్ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ల బృందం మంగళవారం పరిశీలించింది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో వీక్షించింది. పాతబస్తీలో బమృక్‌నుద్దౌలా చెరువుతో పాటు.. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను సందర్శించింది. చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపట్టక ముందు, తాజా పరిస్థితులను గమనించింది. వరదల నివారణకు చెరువుల ప్రాధాన్యత ఎంతో ఉందని వివరించింది.
News July 8, 2025
వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మల్లిఖార్జున్

వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా మల్లిఖార్జున్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఆయనకు గత ప్రిన్సిపల్ కిరణ్మయి పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. స్వాగతం పలికిన వారిలో మెడికల్ కళాశాల ఏఓ రఘు తదితరులున్నారు.
News July 8, 2025
ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.