News March 30, 2024

నేను వారితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా: విజయ్

image

‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుండటంతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌ స్టేటస్ గురించి అడిగిన ప్రశ్నకు విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తన తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఇంటర్వ్యూయర్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హాస్యభరితంగా స్పందించారు. నటి రష్మికతో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2026

ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

image

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.

News February 12, 2026

కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

image

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

News February 12, 2026

IMA డెహ్రాడూన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA)డెహ్రాడూన్‌లో 10 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD, NET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianmilitaryacademy.nic.in/