News July 8, 2025

పవన్ కళ్యాణ్ ఆగ్రహం

image

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.

Similar News

News August 31, 2025

వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

image

TG: ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో స్పష్టతనిచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

News August 31, 2025

అల్లు అరవింద్, బన్నీని ఓదార్చిన పవన్ కళ్యాణ్

image

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి ఆయనతో పాటు అల్లు అర్జున్‌ను ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించారు. వృద్ధాప్య సమస్యలతో కనకరత్నం (94) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

News August 31, 2025

సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు: KTR

image

TG: BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించని గవర్నర్ బిల్లుపై సంతకం పెడతారా అని ప్రభుత్వాన్ని KTR ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినంత మాత్రాన అమలు కాదు కదా. గవర్నర్‌తో బలవంతంగా సంతకం పెట్టిస్తారా? సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? BC రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే CM రేవంత్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి’ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలన్నారు.