News July 8, 2025
ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి జాగ్రత్తగా సంరక్షించాలని కోరారు. పచ్చని మొక్కలను దత్తత తీసుకొని పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.
News July 8, 2025
భూభారతి దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరించాలి: కలెక్టర్

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ తహశీల్దార్లను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీఓలు ఉన్నారు.
News July 8, 2025
మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఘనత కాంగ్రెస్‌దే: మంత్రి

మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. గత BRS ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.