News July 8, 2025

శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని

image

నేపాల్ PM కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగా శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించారని అన్నారు. శివుడు, విశ్వామిత్రుడు తమ ప్రాంతానికే చెందినవారన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు దేశ ప్రజలు సంకోచించవద్దని పిలుపునిచ్చారు. అటు భారతదేశం ‘నకిలీ అయోధ్య’ని ప్రచారం చేస్తోందని కూడా ఆయన విమర్శించారు. కాగా మన పురాణాల ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించారని ప్రసిద్ధి.

Similar News

News August 31, 2025

బార్లకు తగ్గిన దరఖాస్తుల కిక్కు

image

APలో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు మూడేళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి, టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు ఒకట్రెండు దరఖాస్తులే రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి నాలుగేసి దరఖాస్తులొస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు.

News August 31, 2025

Way2News EXCLUSIVE… కాళేశ్వరం రిపోర్ట్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <>Way2News<<>> సంపాదించింది. ప్రాజెక్టు అంచనాల తయారీ, పరిపాలన, CWC అనుమతుల్లో లోపాలున్నాయని నివేదిక స్పష్టం చేసింది. KCR నిర్ణయం మేరకే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లు నిర్మించారని పేర్కొంది. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో దీనిపై చర్చ జరగనుంది.

News August 31, 2025

ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: CM

image

TG: ఆరునూరైనా BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. BC రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి దగ్గర ఉందని, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దీనిపై ఢిల్లీలో తాము ఆందోళన చేస్తే BRS MPలు ఎందుకు రాలేదని అసెంబ్లీలో CM ప్రశ్నించారు.