News July 8, 2025
ముమ్మిడివరం: గుట్కా అమ్మకాలపై పోలీసులు తనిఖీలు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మిడివరంలో మత్తు పదార్ధాలు, సిగరెట్స్, గుట్కా, అమ్మకాలపై మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముమ్మిడివరం CI మోహనకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జ్వాలా సాగర్ సిబ్బందితో బడ్డిషాపులు, టీ పాయింట్లలో తనిఖీలు జరిపారు. పలు షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. మత్తు పదార్థాలు విక్రయించేవారికి పుట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News July 8, 2025
మహదేవపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్

మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఐ జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో గోడలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వాల్ కొటేషన్స్ ద్వారా మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటూ, సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్ఐ అన్నారు.
News July 8, 2025
ఈనెల 16న ఆమెకు మరణశిక్ష అమలు!

యెమెన్‌లో వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళ నర్సు నిమిష ప్రియకు ఈనెల 16న అక్కడి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయనుంది. 2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎలాగైనా పాస్‌పోర్ట్ తీసుకోవాలని 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా మోతాదు ఎక్కువై చనిపోయాడు. ఈ కేసులో అరెస్టైన ఆమెకు మరణశిక్ష పడింది.
News July 8, 2025
ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.