News July 8, 2025
హై బడ్జెట్.. MEGA157 నాన్ థియేట్రికల్ రైట్స్‌కే రూ.100 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే రూ.100 కోట్ల వరకూ వసూలు చేయాలని, అలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నాయి. కాగా, MEGA157 చిత్రీకరణకు రూ.180 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News July 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 9, 2025
శుభ సమయం (09-07-2025) బుధవారం

✒ తిథి: శుక్ల చతుర్దశి రా.1.02 వరకు తదుపరి పూర్ణిమ
✒ నక్షత్రం: మూల తె.5.13 వరకు తదుపరి పూర్వాషాడ
✒ శుభ సమయం: ఏమీలేవు
✒ రాహుకాలం: మ.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.11.36.మ.12.24 వరకు
✒ వర్జ్యం: మ.11.59-1.41 వరకు తిరిగి తె.3.30-5.12 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.20-12.02 వరకు
News July 9, 2025
టుడే టాప్ స్టోరీస్

* మహిళలను బూతులు తిట్టడం YCP సిద్ధాంతం: CM చంద్రబాబు
* రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని కేంద్రానికి CM రేవంత్ వినతి
* ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మంత్రి లోకేశ్
* రేవంత్‌కు రచ్చ తప్ప చర్చ చేయడం రాదు: KTR
* కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలి: Dy.CM భట్టి
* ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యల దుమారం
* శ్రీశైలం గేట్లు ఎత్తి నీటి విడుదల