News July 8, 2025
ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.
Similar News
News September 1, 2025
TODAY HEADLINES

* దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్
* రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి ఉత్తమ్
* మేడిగడ్డ రిపేర్లకు రూ.350 కోట్లే అవుతాయి: KTR
* బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
* రేషన్ షాపుల్లో రాగులు, గోధుమ పిండి, నూనె: మంత్రి నాదెండ్ల
* జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
* భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు: మోదీ
News September 1, 2025
ఉగ్రవాదంపై జిన్‌పింగ్‌తో మోదీ చర్చ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ ఉగ్రవాదం అంశాన్ని లేవనెత్తినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. టెర్రరిజంపై పోరాడేందుకు ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని చర్చించుకున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలని నేతలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. బోర్డర్ వెంట శాంతి, ప్రశాంతత నెలకొనేలా వ్యవహరించాలని చర్చించినట్లు తెలిపారు.
News August 31, 2025
జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.