News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Similar News
News July 9, 2025
మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
News July 9, 2025
రేపు మరోసారి ఆస్పత్రికి కేసీఆర్

TG: బీఆర్ఎస్ అధినేత KCR రేపు ఉదయం మరోసారి HYD సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో 2రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఆయన నందినగర్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. రేపు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
News July 9, 2025
ఇక మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్!

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆథరైజేషన్ సెంటర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ జెన్1 లో ఎర్త్ ఆర్బిట్(LEO) శాటిలైట్ ద్వారా ఐదేళ్ల పాటు సేవలందించేందుకు అనుమతులిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.