News July 8, 2025

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక సమర్పణ

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఈ రిపోర్టును రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదిక 4-5 పేజీలతో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి 270 మంది మరణించిన విషయం తెలిసిందే.

Similar News

News July 9, 2025

పాత వాహనాలకు నవంబర్ 1 వరకే ఛాన్స్

image

పాత వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాన్స్ నవంబర్ 1 వరకేనని తాజాగా వెల్లడించింది. ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టంలో సమస్యలే ఇందుకు కారణమంది. కాగా పదేళ్లు దాటిన డీజిల్, 15ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఫ్యూయెల్ బ్యాన్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీతో పాటు సమీప 5 ప్రాంతాల్లో NOV 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది.

News July 9, 2025

ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

image

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.

News July 9, 2025

ఇక సెలవు.. శివశక్తి దత్తా అంత్యక్రియలు పూర్తి

image

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(92) అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. <<16987487>>శివశక్తి దత్తా<<>> వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.