News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News August 31, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.200-220, వరంగల్‌లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
News August 31, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News August 31, 2025
పర్యాటక రంగంలో రూ.12వేల కోట్ల పెట్టుబడులు: దుర్గేశ్

AP: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ రంగానికి ₹12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని, లంబసింగి, వంజంగి, అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటు విశాఖ MGM గ్రౌండ్స్‌లో SEP 5 నుంచి 3 రోజుల పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది.