News July 8, 2025
రాజమండ్రిలో ఈనెల 13న బాస్కెట్ బాల్ జిల్లా జట్టు ఎంపిక

బాస్కెట్ బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక ఈనెల 13న రాజమండ్రి ఎస్ కే వీటీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు పిఠాపురంలో మీడియాతో తెలిపారు. అదే రోజు జిల్లా చాంపియన్ షిప్ నిర్వహిస్తామన్నారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఒరిజినల్ ఆధార్, పుట్టిన రోజు సర్టిఫికెట్ తో హాజరు కావాలని సూచించారు.
Similar News
News July 9, 2025
సిద్దిపేట: పోలీస్ కమిషనర్‌ను కలిసిన అడిషనల్ పీపీ

సిద్దిపేట అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్ట్ అడిషనల్ పీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ కనకయ్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతనంగా అడిషనల్ పీపీగా బాధ్యతలు చేపట్టినందుకు కనకయ్యను సీపీ అభినందించారు. కేసులలో నేరస్థులకు శిక్షలు పడే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకపాత్ర వహించాలని సూచించారు.
News July 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ జిల్లాలో కార్మిక సంఘాల సమ్మె విజయవంతం
✓ రేపు కొత్తగూడెంలో పవర్ కట్
✓ కలెక్టరేట్‌లో ఆధార్ క్యాంపునకు విశేష ఆదరణ
✓ Way2Newsలో కథనం.. అధికారులపై ఎమ్మెల్యే జారే అసహనం
✓ జిల్లా వ్యాప్తంగా 5 ఆధార్ సెంటర్లు: అడిషనల్ కలెక్టర్
✓ రేగులగండి చెరువులో సింగరేణి ఉద్యోగి గల్లంతు
✓ కొత్తగూడెం: వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
✓ భద్రాచలం రామాలయ ఈవోపై జరిగిన దాడిని ఖండించిన తుమ్మల.
News July 9, 2025
‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.