News July 8, 2025
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సీత్లా పండుగ

బంజారాలు ఈ ఏడాదిలో జరుపుకునే మొదటి పండుగ సీత్లా. ముఖ్యంగా బంజారా తెగలో ప్రకృతిని, పశుసంపదను, పంటలను కాపాడే దేవతైన సీత్లా మాతను పూజిస్తారు. పండుగను ఏటా ఆషాఢమాసంలో జరుపుకుంటారు. భవానీ మాతకు మహిళలు నైవేద్యంగా పాయసం, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, గుగ్గిళ్లను సమర్పిస్తారు. మీ తండాల్లో ఈరోజు సీత్లా పండుగ జరుపుకుంటున్నారా?.. COMMENT చేయండి.
Similar News
News July 9, 2025
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కీలక ఆదేశాలు..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపాలని, జుక్కల్‌లో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జుక్కల్ CHCను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి, ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
News July 9, 2025
అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధం

అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధించారు. గిరి ప్రదక్షిణలో అప్పుఘర్ బీచ్ చాలా కీలకం. ఇక్కడే స్నానమాచరించి తిరిగి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఒకేసారి వేలల్లో జనం ఇక్కడకు చేరుకుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగా స్నానాలు నిషేధించారు. ఇక్కడ తీరంలో స్నానాలు చేయడానికి నీటిని, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ కూడా ఇసుకలోనే ఏర్పాటు చేశారు.
News July 9, 2025
అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.