News July 8, 2025
అమలాపురం: పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్ష

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై జాయింట్ కలెక్టర్ శాంతి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. వినతుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పరిష్కారం ఉండాలని అధికారులను ఆదేశించారు
Similar News
News July 9, 2025
అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధం

అప్పుఘర్ బీచ్‌లో సముద్ర స్నానం నిషేధించారు. గిరి ప్రదక్షిణలో అప్పుఘర్ బీచ్ చాలా కీలకం. ఇక్కడే స్నానమాచరించి తిరిగి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. ఒకేసారి వేలల్లో జనం ఇక్కడకు చేరుకుంటారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగా స్నానాలు నిషేధించారు. ఇక్కడ తీరంలో స్నానాలు చేయడానికి నీటిని, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ కూడా ఇసుకలోనే ఏర్పాటు చేశారు.
News July 9, 2025
అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.
News July 9, 2025
నిరుద్యోగ యువతీయువకులకు సువర్ణవకాశం

శంకరపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద నిరుద్యోగ యువతీయువకులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో శిక్షణ అందించి ఉద్యోగం కల్పించనున్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో ఈ నెల 10న కార్యాలయంలో సంప్రదించాలని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.