News July 8, 2025
నరసరావుపేట: మొక్కలు నాటిన కలెక్టర్

నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ రైతు రావి ఏడుకొండలు పొలంలో మామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ పి. అరుణ్ బాబు ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు పొలంలో పండ్ల తోటల పెంపకం చేపట్టినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాకు 600 ఎకరాలలో మొక్కలు పెంపకం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టి.వి కృష్ణ కుమారి, తహశీల్దారు పాల్గొన్నారు.
Similar News
News July 9, 2025
32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?
News July 9, 2025
NZB: కన్నబిడ్డను చంపిన తల్లికి జైలు శిక్ష

5నెలల చిన్నారిని చంపిన తల్లికి జైలుశిక్ష పడినట్లు SI సందీప్ తెలిపారు. భీమ్‌గల్ మండలం గోనుగోప్పులకి చెందిన మల్లేశ్- రమ్యల కూతురు శివాని ఈ నెల 6న అనుమానాస్పదంగా మృతిచెందింది. తన కూతురిని భార్యే హత్యచేసిందని మల్లేశ్ PSలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్యను విచారించగా ఊపిరాడకుండా చేసి తానే చంపినట్లు నేరం ఒప్పుకుంది. రమ్యను కోర్టులో హాజరుపరచి జైలుకు పంపినట్లు SI పేర్కొన్నారు.
News July 9, 2025
NLG: మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

నలుపు, కొండ అనే రెండు పదాల కలయిక వలన ‘నల్లకొండ’ ఏర్పడింది. నల్గొండలో నలుపు రంగు గల కొండ ఉండటం వలన ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. గతంలో నల్గొండను నీలగిరి అని పిలిచేవారు. బహమనీ సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని అల్లావుద్దీన్ బహమన్ షా స్వాధీనం చేసుకున్న తర్వాత పేరు నల్లగొండగా మారింది. నిజాంల పాలనలో ఈ పేరు అధికారికంగా నల్గొండగా స్థిరపడింది. మరీ మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చిందో కామెంట్ చేయండి.