News July 8, 2025

వనపర్తి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు ఈనెల 13 వరకు http://national awardstoteachers.education.gov.in సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News July 9, 2025

NZB: కన్నబిడ్డను చంపిన తల్లికి జైలు శిక్ష

image

5నెలల చిన్నారిని చంపిన తల్లికి జైలుశిక్ష పడినట్లు SI సందీప్ తెలిపారు. భీమ్‌గల్ మండలం గోనుగోప్పులకి చెందిన మల్లేశ్- రమ్యల కూతురు శివాని ఈ నెల 6న అనుమానాస్పదంగా మృతిచెందింది. తన కూతురిని భార్యే హత్యచేసిందని మల్లేశ్ PSలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్యను విచారించగా ఊపిరాడకుండా చేసి తానే చంపినట్లు నేరం ఒప్పుకుంది. రమ్యను కోర్టులో హాజరుపరచి జైలుకు పంపినట్లు SI పేర్కొన్నారు.

News July 9, 2025

NLG: మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చింది?

image

నలుపు, కొండ అనే రెండు పదాల కలయిక వలన ‘నల్లకొండ’ ఏర్పడింది. నల్గొండలో నలుపు రంగు గల కొండ ఉండటం వలన ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. గతంలో నల్గొండను నీలగిరి అని పిలిచేవారు. బహమనీ సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని అల్లావుద్దీన్ బహమన్ షా స్వాధీనం చేసుకున్న తర్వాత పేరు నల్లగొండగా మారింది. నిజాంల పాలనలో ఈ పేరు అధికారికంగా నల్గొండగా స్థిరపడింది. మరీ మీ ఊరి పేరేమిటి? దానికి ఆ పేరెలా వచ్చిందో కామెంట్ చేయండి.

News July 9, 2025

రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.