News July 8, 2025

పంజాగుట్ట సర్కిల్ పరిధిలో భారీగా ట్రాఫిక్

image

HYDలో రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. పంజాగుట్ట X రోడ్- కోఠి రూట్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వెంగళ్‌రావు పార్క్, పంజాగుట్ట X రోడ్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్, చట్నీస్ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్ వైపు పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News July 9, 2025

HYD: రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

image

రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించనున్నారు. 5వ బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాఘవేందర్ తెలిపారు. కాగా, ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనాన్ని సమర్పించిన విషయం తెలిసిందే.

News July 9, 2025

HYD: మహిళలు.. ఈ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.

News July 9, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

image

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.