News July 8, 2025

జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

image

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.

Similar News

News July 9, 2025

32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

image

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?

News July 9, 2025

రేపు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు రేపు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తచెరువులోని శ్రీసత్యసాయి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 10న నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీట్ 2.0లో పాల్గొననున్నారు. CMతో పాటు మంత్రి లోకేశ్ కూడా హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రేపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగనుంది.

News July 9, 2025

దర్శకుడితో సమంత మరో టూర్.. ఫొటోలు వైరల్

image

స్టార్ హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మరోసారి విదేశాల్లో పర్యటించారు. అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో పర్యటించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దీంతో మరింత ఊపందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు సమంత గానీ, రాజ్‌గానీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గతంలో వీరిద్దరు <<16638854>>దుబాయ్‌లో<<>> పర్యటించారు.